Sunday, September 25, 2011

అర్జునుడు II

    అర్జున్, శైలజ honeymoon కి new zealand వెళ్తున్నారు. విమానం malaysia మీదుగా new zealand వెళ్తోంది. అందరూ సర్దుకుని కూర్చుంటున్నారు. అర్జున్, పై కాబిన్ లో తన బాగ్ ని పెడుతున్నాడు. ఎంత try చేసినా బాగ్ అందులో fit అవ్వటం లేదు. మరొక్కసారి బలంగా తోసి, అంతే force తో చెయ్యి వెనక్కి తీసాడు అర్జున్. అతని మోచెయ్యి, అటు వైపు గా వెళ్తున్న air hostess తలకి తగిలింది. అసలే పొడుగు మనిషి, పొడుగు చేతులు, ఒక సారి బలంగా వెనక్కి తీయడంతో, గట్టి దెబ్బ తగిలి air hostess కింద పడిపోయింది. ఆమెని వెనక్కి తిప్పితే గాని తెలియలేదు, స్పృహ కోల్పోయిందని. 

ఇంతలో, ఇంకో foreign air hostess, కొంచం పెద్దావిడ అటువైపు వచ్చింది.

Air hostess: Excuse me Sir! (అర్జున్ తో) What happened? 
అర్జున్: I hit her on her head and she fainted. (కొంచెం భయంగా). 
Air hostess: Yes Sir! But why did you hit her? 

అర్జున్: I hit her on her head and she ... (మళ్ళీ అదే కంటిన్యూ చేసాడు. ఈ సారి, ఇంకా భయంగా ఉంది అతనికి)
Air hostess: (Disappointed గా పేస్ పెట్టి) I am afraid Sir, then I have to call the police and, .... (ఇంకో వైపుకి చూస్తూ). 

ఇప్పుడే bathroom నించి వచ్చిన శైలజ ఇదంతా చూసింది. కొంచెం ఫాస్ట్ గా నడుస్తూ వచ్చి, 

శైలజ: (Air hostess తో), Excuse me! It was just an accident! He was trying to push the baggage into the rack, and his hand hit her accidentally. It was an accident (repeat చేసింది).

Air hostess అవునా అన్నట్టు, అర్జున్ కేసి చూసింది. తల దించుకున్నఅర్జున్, అవునన్నట్టు తల ఊపాడు. శైలజ కళ్ళేగరేస్తూ Air hostess కేసి చూసింది. Air hostess రెండో వైపు చూస్తూ, అనుమానం గా ఫేస్ పెట్టి, 

Air hostess: ఒకే ... (కొంచెం సేపాగి) ... సారీ సర్! ... It's allright. 

ఫారిను Air hostess ఇంక నిష్క్రమించింది. 

శైలజ కూర్చుంటూ, అర్జున్ చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టింది. వీళ్ళ వెనకాల row లో, కలర్-కలర్ సూట్లు వేసుకుని, ఇద్దరు ఊరోళ్ళు, బ్రహ్మం, భద్రం కూర్చున్నారు. వీళ్ళు కూర్చుంటూ ఉండగా, ఏదో జోక్ వేసుకుని నవ్వారు. ఈ episode అంటా ఫాలో అవుతూనే ఉన్నారు వాళ్ళు.  

అర్జున్ కి కొంచెం టెన్షన్ గా ఉంది. తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది అతనికి. ఎలాగో చైర్ లో కూలబడ్డాడు. వెనకాల బ్రహ్మం, 

బ్రహ్మం: (భద్రం తోటి) బావ, బావా! 
భద్రం: ఏంట్రా అది! 
బ్రహ్మం: మనం విమానం ఎక్కడం ఇది (అర్జున్, శైలజల కేసి తిరిగి నవ్వుతూ) పదో సారి కదా! మరి మొదటి సారి ఎక్కిన వాళ్లకి ఎలా ఉంటుంది బావా? 
భద్రం: (అంతా వెంటనే క్యాచ్ చేసి...) ఏముందిరా! కళ్ళు తిరుగుతున్నట్టు, కాళ్ళు వణుకుతున్నట్టు, వాంతి అవుతున్నట్టు ఉంటుందిరా బామ్మర్ది! 

Magazine పేజీలు తిరగేస్తున్న శైలజ, "ఓహో!" అన్నట్టుగా తల ఎగరేసి, తిరిగి magazine చదవడం మొదలెట్టింది.  ఇక్కడ నిజంగానే అర్జున్ కి కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు, చేతులు అతనికి తెలియకుండానే వణకడం మొదలెట్టాయి. వెనకాల వాళ్ళు జోక్స్ వేసుకుంటూనే ఉన్నారు. అర్జున్ కి టెన్షన్ కి ఏమి వినిపించడం లేదు. వెనకాల వాళ్ళు అతని పరిస్థితి చూసి ఇంకా రెచ్చిపోయారు. శైలజ మటుకు ఏమి పట్టించుకోవడం లేదు. 

బ్రహ్మం: బావా, బావా! 
భద్రం: ఏంట్రా అది! (కొంచెం చిరాగ్గా) 
బ్రహ్మం: ఈ ఇమానాల్లో మందిస్తారు కదా, నువ్వైతే ఎన్ని పెగ్గులు ఎయ్యగలవ్ బావా! 
భద్రం: పెగ్గులే౦ట్రా! బాటిల్సే బాటిల్సు!
బ్రహ్మం: ఆహా, సూపర్ బావా! స్ట్రె౦గ్త్ అంటే నీది, నీది బావా! నేను, ఒక్క పెగ్గు కూడా వెయ్యలేను బావా! (వెటకారం గా నవ్వుతూ, శైలజ అర్జున్ ల కేసి చూస్తూ అన్నాడు). 

అర్జున్ కి ఇవేమీ వినిపించడం లేదు. ఒక పావుగంట తర్వాత, అర్జున్ కి కొంచెం నెమ్మదించింది. అతనికి తల తిరగడం, కాళ్ళు చేతులు వణకడం ఆగిపోయాయి. కొంచెం చెమట కూడా పట్టింది కాని, విమానం లో A.C ఉండడం వల్ల, ఇప్పుడు చెమట అంతా ఆరిపోయింది. ఇప్పుడు అర్జున్ కి బాగానే ఉంది. ఇంతలో Seat-Belt sign రావడంతో, తన బెల్ట్ పెట్టుకున్నాడు అర్జున్. శైలజ తనకి బెల్ట్ పెట్టుకోవడం రావట్లేదంది, అర్జున్ హెల్ప్ చేస్తున్నాడు. 

ఈ మధ్య బ్రహ్మం, భద్రం గోల కాస్త తగ్గింది, అప్పుడప్పుడూ జోక్స్ వేస్తూనే ఉన్నారు గాని. Air-Hostess episode అయ్యి పావుగంట దాటడంతో, అర్జున్ కి మామూలు గానే ఉంది. పైగా ఇప్పుడు magazine శైలజ, అర్జున్ ఇద్దరూ కలిసి చదువుతున్నారు కూడా. విమానం కదిలింది.

విమానం take-off అవుతోంది. సడన్ గా వెనక సీట్లో బ్రహ్మం మొదలెట్టాడు.


బ్రహ్మం: (ఊగిపోతూ...) ఆపండ్రోయ్!

అర్జున్ కి మొదట అర్ధ౦ కాలేదు. Magazine లోంచి తలతిప్పి పక్కకి చూసాడు. ఇంతలో, శైలజ ఏదో జోక్ వేసి engage చెయ్యడంతో, మళ్ళీ తల తిప్పి, ఇద్దరూ నవ్వుకున్నారు.

బ్రహ్మం: (ఊగిపోతూ...) ఆపండ్రోయ్!
భద్రం: (బ్రహ్మం తో) ఆపరా బామ్మర్ది! విమానం గాల్లోకి లేచే దాకానే ఉంటుంది, ఊరికే నస పెట్టకు.
బ్రహ్మం కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, తల ఓ range లో తిరుగుతోంది. కొంచెం సేపైతే డోకొచ్చేలా ఉంది. విమానం take-off అవ్వబోతున్న టైం లో, సరిగ్గా, సీట్-బెల్ట్ తీసేసి, పడుతూ లేస్తూ పరిగెత్తాడు బ్రహ్మం, toilet లోకి. అతన్ని చూసి, దూరంగా ఉన్న ఒక Air Hostess, 

Air Hostess: Hey, Mister!

ముందు వాళ్ళందరూ వెనక్కి తిరిగి చూసారు. అర్జున్ కూడా చూడబోతుంటే, ఏదో జోక్ వేసి శైలజ engage చేసింది. ఇద్దరూ నవ్వుకున్నారు.

కొంతసేపటికి, bathroom నించి బ్రహ్మం బయటికి వచ్చాడు. అతని ముక్కు దెబ్బ తగిలినట్టు, ఎర్రగా ఉంది. కొద్దిగా కుంటుతున్నాడు. Air Steward వచ్చి, దన్నుగా జబ్బ పట్టుకుంటే, మూలిగాడు.

అతన్ని పట్టుకుని, సీట్లో కూర్చోబెడుతూ, Air Hostess అడిగింది. 

Air Hostess: First time?

బ్రహ్మం: (బుంగమూతి పెట్టి) No, tenth time. (చెప్పాడు) 

Air Hostess చిన్నగా నవ్వి వెళ్ళిపోయింది. భద్రం అప్పుడే గాఢనిద్ర లోకి వెళ్ళిపోయినట్టు, ఏదో magazine తో ముఖం కప్పేసుకుని, గుర్రు పెడుతున్నాడు. 

కొంతసేపటికి భద్రం లేచాడు. ఏదో మాట్లాడుతున్న అర్జున్ తో శైలజ,  

శైలజ: Actually, why don't you talk to me in English?
అర్జున్: ఇంగ్లీషె౦దుకు, మన భాష తెలుగు ఉండగా (నవ్వుతూ అన్నాడు)? 
శైలజ: No, Arjun please. We should talk in English. Because we are on a plane? It is an international language, ya... (చేతులు తిప్పుతూ అంది)
అర్జున్: సరే, అలాగే కానియ్! (కొంచెం అనుమానంగా ఆమెకేసి చూస్తూ, నవ్వుతూ అన్నాడు). 

వాళ్ళిద్దరూ english లో మాట్లాడుకుంటున్నారు. కొంచెం సేపటికి అర్జున్ నిద్రలోకి వెళ్ళాడు. Beverages serve చేసే బండి తో Air Hostess వచ్చింది, శైలజ ఏమి వద్దంది. 

వెనకాల బ్రహ్మం, భద్రం తెగ తంటాలు పడుతున్నారు.  

భద్రం: ఇస్కీ... ఇస్కీ... ఇస్కీ... సాచిస్కి! 
ఏమి అర్ధం కాలేదన్నట్టు ఫారిను air hostess ఫేసు పెట్టింది. 
Air Hostess: What...? (పక్కగా చూస్తూ)
శైలజ: (Mag లోంచి తలెత్తి...) He means Whiskey, Scotch.

Air Hostess మాట్లాడకుండా whiskey గ్లాసు లో పోసింది. 

శైలజ: (తల వెనక్కి తిప్పి, కాస్త రఫ్ గా..., భద్రం తో)  ఏ వూరు బాబు మన్ది? 
మారు మాట్లాడకుండా భద్రం whiskey తాగేసాడు. 

విమానం Kuala Lumpur లోఆగినప్పుడు, వాళ్ళిద్దరూ గప్-చుప్ గా దిగేశారు. బ్రహ్మం వీళ్ళ కేసి చూసి, ఒక వెర్రి నవ్వు నవ్వాడు. అర్జున్ నవ్వు రిటర్న్ చేసాడు. శైలజ ఏమి పట్టించుకోకుండా magazine మీద concentrate చేసింది. విమానం Kuala Lumpur నించి, New Zealand వైపు తన ఆఖరి మజిలీ ని స్టార్ట్ చేసింది. 

(సశేషం)

Monday, September 5, 2011

అర్జునుడు -- I

    అప్పుడే భీమవరం నించి Auto దిగిన సత్తిబాబు, ఎదురుగుండా ఉన్న పెద్ద line ని చూసి ఆగిపోయాడు. "అయ్య బాబోయ్! ఇదేంటి! ఈ మధ్య పెళ్ళిళ్ళకి కూడా లైన్లు కడుతున్నారా?". ఏదో "గుంపులో గోవింద" అని, లైన్లో నిలబడిపోయాడు. అసలా line ఎందుకో అని, కొంచం ముందుకి చూద్దామని చాల try చేసాడు. ఉహూ! లాభం లేదు, line అష్టవంకర్లు తిరిగి ఉంది. 

    కొంతసేపటికి line లో ముందుకి వచ్చాడు సత్తిబాబు. ముందు జరుగుతున్నదంతా కనిపిస్తూనే ఉంది. ఎదురుగా ఒక desk దగ్గిర ఒక అమ్మాయి పన్నీరు జల్లుతోంది. ఇంకో చిన్న పిల్ల గులాబీలు ఇస్తోంది. ఇదంతా బానే ఉంది కాని, ఇంకొకటి కూడా జరుగుతోంది అక్కడ. అక్కడ రాజీవ్ గాడు, సంతోష్ గాడు ఏదో పని ఉన్నట్టు హంగామా చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరి తోటి, 

రాజీవ్: మేస్టారు, నమస్తే! సార్, ID card ఉందాండి, మరి address proof? (పక్కనే సంతోష్ గాడు ఏదో రిజిస్టర్ లాంటిది పెట్టి, అందరి names నోట్ చేస్తున్నాడు. కొంతమంది పరాచికాలాడటానికి try చేస్తున్నారు, కొంతమంది ఇదేంటబ్బా అనుకుంటూ ముందుకి కదులుతున్నారు. మొత్తానికి వాళ్ళ అల్లరి బారిన పడటం మటుకు తప్పటం లేదు ఎవరికీ.)

    ఇదంతా చూస్తున్న సత్తిబాబుకి చిర్రెత్తింది. "పావుగంట సేపు, line లో నిలబెట్టి చివరికి వీళ్ళు చేసేది ఇదా! లాభం లేదు, వీళ్ళకి నా (భీమవరం) తెలివితేటలు చూపించాల్సిందే!", fix ఐపోయాడు. కరక్ట్ గా తన వంతు వచ్చేవరకు ఆగాడు.

రాజీవ్: (సత్తిబాబు తో), ఏవండి మాస్టారు! ID card సార్! (అడిగాడు. ఏదో ధ్యాసలో ఉన్నట్టు కటింగ్ ఇచ్చి, ఇప్పుడే విన్నట్టుగా face పెట్టాడు సత్తిబాబు. ఆ పైన Shirt జేబుల్లో చూసాడు, మర్చిపోయి ఆందోళన పడుతున్నట్టుగా face పెట్టి, కంగారు చూపిస్తూ pant జేబుల్లో వెతకడం మొదలుపెట్టాడు. కొంత సేపటికి తను తెచ్చిన బాగ్ ఓపెన్ చేసాడు. చాలా సేపే అయ్యింది. రాజీవ్ గాడు, సంతోష్ గాడి కేసి చూసి చిన్న నవ్వు నవ్వుతున్నాడు.)

సత్తిబాబు: అరెరే, మర్చిపోయాను సార్! మీరేమి అనుకోకపోతే, (పక్కనున్న, పన్నీరు జల్లుతున్న అమ్మాయి కేసి తిరిగి), పాపా! Address రాసుకోమ్మా! (తన purse తీసి, అందులో ఉన్న తన భీమవరం అడ్రస్ అంతా గడగడా చదివేసాడు. వీళ్ళకి ఏమి జరుగుతోందో తెలిసేలోపుగా..., రాజీవ్ కేసి తిరిగి), ఈ అడ్రస్ లో ఉన్న మా ఇంటికి కి వెళ్లి సత్తిబాబు ఇమ్మన్నాడని చెప్పండి, ID proof, Address proof మీ చేతికిస్తారు. (మళ్ళీ రాజీవ్, సంతోష్ ల కేసి చూస్తూ), సారీ అండి! (చాలా దీనమైన face పెట్టాడు. మళ్లీ వాళ్లకి అవకాశం ఇవ్వకుండా అక్కడనించీ కదిలాడు).

అవాక్కై చూస్తున్న రాజీవ్ ని చూస్తూ, "తిక్క కుదిరిందా" అన్నట్టు, ఆ అమ్మాయి నవ్వడం మొదలెట్టింది. సంతోష్ కి ఏమి పూర్తిగా అర్ధంకాలేదు. సత్తిబాబు కేసి చూస్తూ ఏదో అనబోయిన సంతోష్ గాడిని ఆపి,

రాజీవ్: వాడి౦టికెళ్లి, వాడు ఇమ్మన్నాడని చెప్పాక ఇంకా ID proof, Address proof ఎందుకురా సత్తిబాబూ! (సంతోష్ గాడిని ఉద్దేశించి "లో వాయిస్" లో అన్నాడు రాజీవ్. సంతోష్ గాడికి సీన్ అర్ధం అయ్యింది.)

    ఇంకో ముగ్గురు నలుగురిని బాధించి, ఏదో పని ఉన్నట్టుగా అక్కడినించి కదిలారు రాజీవ్, సంతోష్. దారిలో మంటపం మీదనించి వెళ్తూ, 

రాజీవ్: ఏరా! అంతా ఓకేనా! (పెళ్లి పీటల మీద ఉన్న తన friend, పెళ్లి కొడుకుని ఉద్దేశించి అన్నాడు, ఏడిపిస్తున్నట్లుగా. పెళ్లి పీటల మీద ఉన్న అర్జున్, నవ్వుతూ చేతిలోని చెక్కగరిటని విసరబోయాడు. రాజీవ్ గాడు తప్పించుకున్నట్లుగా act చేసి, చిన్నగా నవ్వుతూ తన room కేసి వెళ్ళాడు). 

    సంతోష్ గాడి కోసం వెతుకుతూ ఉన్న రాజీవ్ కి మళ్ళీ సత్తి బాబు తగిలాడు. గుద్దుకుని పడబోతున్న సత్తిబాబు ని పట్టుకుని,

రాజీవ్: మేస్టారు, నేను, నా పేరు రాజీవ్ అండి, పెళ్ళికొడుకు ఫ్రెండ్. (చెప్పాడు).

సత్తి బాబు: నేను, సత్తి బాబంటారండి. పెళ్లి కూతురు తాలూక. (చెప్పాడు)

    కొంచెం సేపటి తరువాత ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. రాజీవ్ జోకులకి
సత్తి బాబు నవ్వుతుంటే, సత్తి బాబు జోకులకి రాజీవ్ నవ్వుతున్నాడు. మొత్తానికి ఇద్దరూ బాగా ఫ్రెండ్స్ అయిపోయారు.

రాజీవ్: మాస్టారు, ఎక్కడుంటున్నారు?

సత్తి బాబు: ఆ!? (అర్ధం కాలేదన్నట్టు పేస్ పెట్టి).

రాజీవ్: అదే, విడిది ఎక్కడా అని?

సత్తి బాబు: కూకట్ పల్లి లో ఉన్న మా అత్తింట్లో చెప్పారండి. సాయంకాలానికి అక్కడే.

రాజీవ్: మేస్టారు, ఆడ పెళ్లి వాళ్ళతో ఉంటె, ఏముందండి. మా బాచ్ తో ఉండండి, సూపర్ enjoyment!

కొంచెం సేపు tempting తర్వాత,

సత్తి బాబు: ఇందులో ఏమి తేడా లేదు కదా? (అనుమానంగా పేస్ పెట్టి)

రాజీవ్: ఎంత మాట గురూగారు! ఇందాకటిదొకటి చాలలేదా మాకు, ఇప్పుడు మనం మనం ఫ్రెండ్స్ అండీ! (
Convincing గా చెప్పాడు. సత్తి బాబు కూడా ఏదైనా తేడా వస్తే, తన (భీమవరం) తెలివితేటలు చూపించవచ్చులే అని follow అయిపోయాడు).

    రూం ఎంటర్ అయిన సత్తి బాబుకి అంతా అయోమయం గా ఉంది. రూం నిండా సిగరెట్ పొగే, కొంతమంది పేకాడుతున్నారు. అంతలో పేకఆడుతున్న సంతోష్ గాడు,

సంతోష్: శైలజ రా, మన శైలజ రా! (ఏడుపు పేస్ పెట్టాడు, వాడిని అందరూ ఊరుకోబెడుతున్నారు)

సత్తి బాబు: (ఏదో అర్ధం అయినట్టు) ఓహో! వద్దు లెండి, నాకర్ధం అయ్యింది, నేవస్తా!  

రాజీవ్: అయ్యయ్యో, మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారు! ఇదేమి మీరు అనుకున్నట్టు కాదండి.

సత్తి బాబు: మరి, ఇంకేంటండి! (కొంచం గట్టిగా అడిగాడు, ఆవేశంగా).

రాజీవ్: అయ్యయ్యో, మీకెలా చెప్పాలి, ఎలా. (కొంచెం సేపు ఆలోచించి) సరే, మీకు విషయం అర్ధం కావాలి అంటే, అర్జున్, శైలజల లవ్ స్టొరీ మీరు వినాలి. అప్పుడే మీకు అర్ధం అవుతుంది.

సత్తి బాబు: (కోపంగా చూస్తూ), సరే, లవ్ స్టొరీ అన్నారు కాబట్టి వింటున్నాను. (ఏదైనా తేడా వస్తే వేసేద్దాం అనుకుని).

రాజీవ్: అర్జున్ మాకందరికీ మంచి ఫ్రెండ్. మాలో కొంతమందికి చిన్నప్పటి నించి కూడా తెలుసు. నేను, సంతోష్ గాడు ఐతే, వాడితో చిన్నప్పడినించి ఫ్రెండ్స్ మే. మేమందరం కలిసి ఒకే సారి జాబ్ లో ఒకే కంపెనీ లో జాయిన్ అయ్యాం. అందరం ఒకే చోట కలిసిఉండే వాళ్ళం కూడా. మేం జాయిన్ అయ్యిన తర్వాత ఒక 6 months కి అనుకుంటా, శైలజ జాయిన్ అయ్యింది. ఆ అమ్మాయి తెలివితేటలు, అందం చూసి మాలో చాలా మంది try చేసాం.

సత్తి బాబు: (కోపంగా) ఊ!

రాజీవ్: అయినా ఆ అమ్మాయి ఎవరికీ పడలేదు. ఆ అమ్మాయిని ఎలాగైనా పడేయ్యాలని చాలా మంది try చేసారు. కాని, తనకున్న clarity ముందు అవన్నీ ఏమి పని చెయ్యలేదు!

సత్తి బాబు: (ఇంకా కోపం గానే) ఊ! (ఇంతలో సంతోష్ గాడు),

సంతోష్: (సత్తి బాబు కేసి చూస్తూ) బాబు, నీ పేరేంటని అన్నావ్!

సత్తి బాబు: (కోపంగా ఎటో చూస్తూ), ఇంకా ఏమి అనలేదు!

సంతోష్: ఐతే ఏదో ఒకటనేయి, ఓ పనైపోతుంది కదా. (కోపం గా తనకేసి చూస్తున్న సత్తి బాబు తో), అహ! మనం మనం ఒక మాటనుకుంటే బెటర్ కదా అని! (మళ్లీ అన్నాడు)

సత్తి బాబు: సత్తి బాబు (ఇంకా కోపంగానే. ఇంతలో సంతోష్ గాడికి పేకాటలో ఫుల్-కౌంట్ పడింది, ఇంక ఆట వైపు వెళ్ళాడు వాడు.)

రాజీవ్: మా అర్జున్ కూడా ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడని మాకెవ్వరికి తెలీదు! అసలు తెలిసే అవకాశమే లేదు వాడితోటి, అంటా silent! (నోటికి zip వేసినట్టు చూపించి, అన్నాడు).

కొంచం సేపటికి,

సత్తి బాబు: మీరెన్నైనా చెప్పండి, అతనంత అమాయకుడంటే నమ్మడం కష్టమండి! అరె, అయినా ఈ రోజుల్లో అంత అమాయకులు ఎక్కడున్నారండి?

రాజీవ్: మీరు నా మాట నమ్మడం లేదు, ఉరేయ్ (అటునించి వెళ్తున్న ఒక బొట్టు candate ని పరిచయం చేసాడు). వీడు చెప్తాడు వినండి! (సత్తి బాబు తో)

బొట్టు: మొదట్లో నేను కూడా వీళ్ళు చెప్పింది నమ్మలేదు, కాని వీళ్ళతో కలిసాక అర్ధంఅయ్యింది. నేను మొదట్లో 6  months వేరే వాళ్ళతో ఉంది, తర్వాత వీళ్ళతో కలిసాను లెండి.

బొట్టు: ఒక సారి మా పని మనిషి, (సంతోష్ గాడు సీన్ లోకి ఎంటర్ అయ్యి flashback రింగులు తిప్పాడు).
 
పనమ్మాయి: ఏంటో, పైకెంతో (దీర్ఘం తీసింది) బుద్ధిమంతుల్లా ఉంటారమ్మా! తీరా చూస్తే అన్నీ వెధవ బుద్దులే!

బొట్టు: (నవ్వుతూ), ఇలాగే సణుక్కుంటూ ఒక వారం రోజులు పని చేసింది. చివరికి తేలిందేమిటంటే, పొద్దున్నే గిన్నెలు తోమటానికి వచ్చిన మా పని పిల్లకి, మా అర్జున్ గాడి కంచం లో మందు వాసన కొట్టిందట! (రాజీవ్, సంతోష్ అంతా నవ్వుతున్నారు).

సత్తి బాబు: (కొంచం నవ్వి, డౌట్ గా) ఆగండాగండి! అది అతని కంచమేనని తనకెలా తెలుసు?

బొట్టు: మేమైనా ఒక్కో రోజు బయట తింటాం గాని, అర్జున్ ది రోజు ఒకే టైం టేబుల్, weekly same menu.

సత్తి బాబు: ఓహో

బొట్టు: ఆఖరికి, వాడు సింక్ లో కంచం పెట్టె angle కూడా దానికి తెలుసు!

బొట్టు: చివరికి ఆ పని చేసింది, ఇదిగో వీడేనని (రాజీవ్ కేసి వేలు చూపిస్తూ) తేలింది! (రాజీవ్ రెండు చేతులు తలమీద పెట్టుకుని దాక్కున్నాడు. అందరూ నవ్వుకున్నారు).

బొట్టు: ఇంకో సారి ఏమైందో తెలుసాండి! ఒక సారి సంతోష్ గాడి Girl friend, 

సత్తి బాబు: (కొంచం రిలీఫ్ గా) ఓహో!

అర్జున్ టవల్లో ఉన్నాడు, ఇక్కడ. చేతిలో గరిటె. పూజ చేసుకుని, నుదుటిమీద బొట్టుతో ఉన్నాడు. డోర్ అవతల ఒక అమ్మాయి english లో తెగ దంచేస్తోంది. సండే మార్నింగ్, full గా makeup అయ్యి ఒచ్చింది. డోర్ మీద ఒక లెవెల్లో బాదుడు మొదలెట్టింది.

ఆ అమ్మాయి: సంతోష్! సంతోష్! (బాదుడు కంటిన్యూ చేసింది.)
 
ఇంక తప్పదనుకొని అర్జున్, డోర్ కొంచెం తీసాడు.

అర్జున్: He is not home! Come back later! (తలుపేసేయ్యబోయాడు. ఇంతలో ఏదో కీడు శంకించిన ఆ అమ్మాయి, తలుపు ధడాల్మని తోసింది). 

ఎదురుగుండా అర్జున్ గాడు, తన కళ్ళజోడు సరి చేసుకుంటూ, పడిపోబోయి నిలదొక్కుకున్నాడు. ఆ అమ్మాయిని చూడగానే, నాలుగు మెలికలు తిరిగి, రెండో రూం తలుపు చాటున దాక్కున్నాడు. ఆ అమ్మాయి అలా ఉండిపోయింది. ఇక్కడ అర్జున్ కి చెమటలు కారుతున్నాయి. టెన్షన్ గా ఆ అమ్మాయి కేసే చూస్తున్నాడు.

ఇద్దర్లోకి ముందుగా ఆ అమ్మాయి తేరుకుంది. నవ్వు మొదలెట్టింది. కొంచం సేపు నవ్వి, ఇంక నవ్వలేనన్నట్టు, చేతులూ తల ఊపుతూ, అక్కడినించి వెళ్ళిపోయింది.

బొట్టు: ఆ అమ్మాయి మా office కాదు కాబట్టి సరిపోయింది, లేకపోతె, (ఇంతలో సంతోష్ గాడు వచ్చి)

సంతోష్: కొక్కొరోకో! (లోకమంతా కోడై కూసేదన్నట్టు expression ఇచ్చాడు. ఈ సారి సత్తి బాబుతో సహా అందరూ నవ్వారు). 

రాజీవ్: అందుకే, ఏ ముద్దు ముచ్చటా లేకుండా, వాడితో మా శైలజ ఎలా ఉంటుందా అని, బాధ పడుతూ ఉంటాం అంతే!

సంతోష్: సైలజమ్మా! శై...ల...జ...మ్మా! (ఏడుపు కంటిన్యూ చేసాడు).

సత్తి బాబు: తప్పండి, మీ అందర్లోకి చాలా బుద్దిమంతుడు, మంచి వాడు, అతన్ని పట్టుకుని ఇలా!

రాజీవ్: మా బాధ కూడా అదే మాస్టారు! (ఏడుపు మొదలెట్టాడు, ఈ సారి అతనితో అందరూ శృతి కలిపారు).

కొన్ని Software పెళ్ళిళ్ళు, నిలబడవని తనకున్న నమ్మకానికి, కొద్దో గొప్పో experience కి వ్యతిరేకంగా, ఆ రోజు పెళ్లి కొడుకు క్యారెక్టర్ గురించి విన్నాక, సత్తి బాబు తృప్తి గా పెళ్లి భోజనం చేసాడు. అంతే కాకుండా, రాత్రంతా జరిగిన పెళ్లి తంతంతా మంటపం లో కూర్చుని చూస్తూనే ఉన్నాడు, interest తో. ఒక పక్క ఈ కోతిమూక అల్లరి జరుగుతూనే ఉంది.

Next డే, సత్తి బాబు తిరుగు ప్రయాణం. తన చుట్టాల దగ్గర, శైలజ దగ్గర చెప్పేసి, పెళ్ళికొడుకు కి చెప్పి, బయల్దేరాడు. అతనికి చివరి వరకూ send-off  ఇచ్చారు, సంతోష్, రాజీవ్ ఇద్దరూ.

ఆ రోజు సాయంకాలం అప్పగింతలు జరుగుతున్నాయి. (ఆ సీన్ లోకి, సంతోష్, రాజీవ్ ఎలాగో దూరారు).

రాజీవ్: నాన్న చిట్టీ! (ఏడుపు గొంతుతోటి). అర్జున్ గాడి చెయ్యి పట్టేసుకొని, (శైలజ కేసి తిరిగి). అయిదు సంవత్సరాలు, హైదరాబాద్ లో (చెయ్యి వెనక్కి చూపిస్తూ) అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లాడమ్మ! (శైలజ కోపంగా చూసింది. ఈ సారి లెక్క చెయ్యలేదు రాజీవ్).

రాజీవ్: ఆఫీసు కి వెళ్ళడం, ఇంటికి రావడం, ఆఫీసు కి వెళ్ళడం ఇంటికి రావడం (ఒక చేత్తో అర్జున్ చెయ్యి పట్టుకుని, ఇంకో చేత్తో ముందుకి వెనక్కి చేస్తూ), తప్ప ఇంకో పని చేసి ఎరగడమ్మ. (ఏడుపు పేస్ పెట్టాడు). ఏ పని చెయ్యమంటే ఆ పనే చేస్తాడు గాని, ఇంకో పని చేసి ఎరగడమ్మా...ఆ...ఆ...! (దీర్ఘం తీసారు ఇద్దరూ. ఇంతలో సంతోష్ గాడు).

సంతోష్: అచ్చు రోబోట్ చిట్టి లాగ (ఇద్దరూ, బాధాకరంగా ఏడుస్తున్నారు. ఇంతలో శైలజ అమ్మ గారు, వీళ్ళని కసురుకోవడం తో అక్కడినించి నిష్క్రమించారు, ఇద్దరూను).

నిజానికి ఈ time అంతా అర్జున్ నవ్వుతూనే ఉన్నాడు, అతనికి ఏమి చెయ్యాలో తెలియటంలేదు. వాళ్ళని గదమాయించింది శైలజే. మొత్తానికి, అంతా పూర్తయ్యాక, Honeymoon కి వాళ్ళని సాగనంపడానికి కుటుంబ సభ్యులతో, రాజీవ్ గాడు కూడా Shamshaabad విమానాశ్రయానికి వెళ్లి, send-off ఇవ్వడంతో, ఈ episode పూర్తి అయ్యింది.

(సశేషం)